Unstoppable with NBK : నందమూరి బాలకృష్ణ గత యేడాది ఆహా ఓటీటీ వేదికగా హోస్ట్ అవతారం ఎత్తారు. అంతేకాదు ఓ హోస్ట్‌గా తనదైన శైలిలో అన్‌స్టాపబుల్ షోను రక్తి కట్టించారు. ఇప్పటికే ఈ షో ఫస్ట్ సీజన్ పూర్తి చేసుకుంది. ఇక అన్‌స్టాపబుల్ షో రెండో సీజన్‌కు ఎప్పటి నుంచో అనే దానిపై బాలయ్య తాజాాగా ఆహా వేదికగా ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ లో ప్రస్తావించారు అంతేకాదు అన్‌స్టాపబుల్ సీజన్ 2కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన చేశారు.