హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఆసుపత్రిలో నిఖా... ఆత్మహత్యాయత్నం చేసిన ప్రేమికులకు పెళ్లి చేసిన పెద్దలు..

క్రైమ్05:57 PM IST Jan 11, 2019

వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలోని కుక్కింద గ్రామానికి చెందిన నవాజ్ అనే 23 ఏళ్ల యువకుడు... బంధువుల అమ్మాయి అయిన 20 ఏళ్ల రేష్మా బేగం ప్రేమించుకున్నారు. రేష్మా బేగం అక్కను, నవాజ్‌ అన్నకు పెళ్లి జరిగింది. దాంతో అక్కాచెలెళ్లను ఒకే ఇంటికి ఇవ్వడం మంచిది కాదనే ఉద్దేశంతో పెద్దలు వీరి పెళ్లికి నో చెప్పేశారు. దాంతో తీవ్ర మనస్థాపం చెందిన రేష్మాబేగం... ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో ఆమెను చూసేందుకు వెళ్లి, అక్కడే పురుగుల మందు తాగాడు. హఠాత్ పరిణామంతో షాక్‌కు గురైన బంధువులు... వెంటనే అదే ఆసుపత్రిలో అతన్ని చేర్పించారు. ఇద్దరూ మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి బయటపడ్డారు. ఇద్దరికీ ఆసుపత్రిలోనే నిఖా చేశారు వారి కుటుంబసభ్యులు. ఈ పెళ్లిలో ఇద్దరూ వీల్‌ఛైర్ మీదే రావడం విశేషం.

Chinthakindhi.Ramu