శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలం ముస్తాబైంది. చైత్రశుద్ధ నవమి రోజు (ఆదివారం) సీతారాముల కల్యాణం వైభవంగా జరగనుంది. వెలుగులు జిమ్ముతున్న విద్యుత్ దీపాల మధ్య భద్రాద్రి ఆలయం మెరిసిపోతోంది. భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల ఎదుర్కోలు ఉత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు.