హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: వివాహేతర సంబంధం.. భార్య తల నరికిన భర్త!

క్రైమ్16:32 PM September 11, 2018

ప్రియుడితో కలిసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఓ భార్యను కిరాతకంగా హత్య చేశాడో భర్త. ఆమె తల నరికి.. దాన్ని చేతిలో పట్టుకుని ఏకంగా 20కి.మీ నడుచుకుంటూ వెళ్లి మరీ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కర్ణాటకలోని చిక్‌మంగళూర్‌ జిల్లాలో ఆదివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. నిందితుడిని సతీశ్‌గా గుర్తించారు. మృతురాలి పేరు రూప. రూప-సతీశ్‌లకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇటీవల రూప సునీల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో సతీశ్ ఆమెపై తీవ్ర అసహనంతో ఉంటున్నాడు. ఆదివారం పని ముగించుకుని ఇంటికొచ్చిన సతీశ్‌కు భార్య రూప ప్రియుడితో దొరికిపోయింది. దీంతో కొడవలితో ఆమె తల నరికి కిరాతకంగా హత్య చేశాడు. దాడి సమయంలో ఆమె ప్రియుడు సునీల్ అక్కడినుంచి పారిపోయాడు.

webtech_news18