LB Nagar : ఎల్బీనగర్... హైదరాబాద్‌లో ఎప్పుడూ రద్దీగా ఉండే జంక్షన్లలో అదీ ఒకటి. అలాంటి చోట సోమవారం నరేందర్ గౌడ్ అనే వ్యక్తి... ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ పై నుంచీ... కిందకు దూకి చనిపోయాడు. అతను రంగారెడ్డి జిల్లా... మంచాల మండలం... లోయపల్లికి చెందిన వాడిగా తెలిసింది. కుటుంబ సమస్యలు, వివాదాల వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నరేందర్ గౌడ్ కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. కేసు రాసిన పోలీసులు... నరేందర్ ఫ్యామిలీని ప్రశ్నిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఎల్బీనగర్‌లో తీవ్ర కలకలం రేగింది.