నిర్మల్ జిల్లా బాసర మండలంలోని ధోడాపూర్ గ్రామనికి చెందిన కుర్లెకర్ శ్రీకాంత్ (24) ఆదిలాబాద్ జిల్లా నరేడిగొండ మండలం కుంటాల జలపాతంలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. శ్రీకాంత్ తన తోటి స్నేహితులతో కలసి విహరయాత్ర కు కుంటాల జలపాతం చూడటానికి వెళ్లి ప్రమాదవశాత్తు జలపాతంలో కాలు జారి పడి పొవడంతొ గల్లంతయ్యి అనంతరం శవమై తేలడంతో తోటి స్నేహితుల్లో విషాధచాయలు చోటుచేసుకున్నాయి. శ్రీకాంత్ పదవ తరగతి వరకు శారదా విద్యాలయం బాసరలో చదవి తన అన్న చదవు కోసం హోటల్ నడుపుతూ తన అన్నకు డబ్బులు పంపేవాడు . శ్రీకాంత్ మరణవార్త విని మృతుని తల్లి తండ్రులు, ధోడాపూర్ గ్రామస్థులు శోక సముద్రములో మునిగారు.