జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని గొడలితో నరికేశారు. బైక్పై వెళ్తున్న వ్యక్తిని అడ్డగించి మరీ దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. అతన్ని కిందపడేసి గొడ్డలితో ఎడాపెడా దాడిచేశాడు. చుట్టూ చాలా మంది ఉన్నా ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. గొడ్డలి దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.