హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : బర్త్ డే కేక్‌లో విషం.. తండ్రీకొడుకుల మృతి

క్రైమ్12:39 PM September 05, 2019

బర్త్ డే కేక్.. ఓ ఇంట్లో తీరని విషాదం మిగిల్చింది. పుట్టినరోజు నాడు సంబరంగా కట్ చేయాలని తెచ్చుకున్న కేక్ వారి ప్రాణాలు తీసింది. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం ఐనాపూర్‌ గ్రామానికి చెందిన రమేష్(39),భాగ్యలక్ష్మి(35)ల కుమారుడు రాంచరణ్(9) పుట్టినరోజును బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ తినిపించగా.. ఆ కేక్ తిన్న వెంటనే రాంచరణ్,రమేష్ మృతి చెందారు. రమేష్ భార్య భాగ్యలక్ష్మి, కుమార్తె పూజితల పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వీరిద్దరికీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు సమాచారంబర్త్ డే సందర్భంగా కోసిన ఆ కేక్‌ను రమేష్ సోదరుడు ఇంటికి పంపించినట్టు తెలుస్తోంది. సోదరుల మధ్య కొంతకాలంగా నెలకొన్న భూవివాదం నేపథ్యంలో.. రమేష్ సోదరుడే కేక్‌లో విషం కలిపి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading