హైదరాబాద్ దుండిగల్లో దారుణం జరిగింది. రెండేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటి బయట ఆడుకుంటున్న సందర్భంలో చిన్నారిని బలవంతంగా ఎత్తుకెళ్లి అతను అత్యాచారానికి పాల్పడ్డట్టు చెబుతున్నారు. సీసీటీవి ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు చిన్నారిని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవిలో స్పష్టంగా రికార్డయ్యాయి.