మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీటీసీ విక్రంరెడ్డిని పోలీసులు బూతులు తిడుతూ తన్నుకుంటూ తీసుకెళ్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన భూక్యా శ్రీనివాస్ అనే వ్యక్తి కుటుంబానికి న్యాయంచేయాలంటూ ధర్నా చేస్తుండగా, తొర్రూరు సీఐ చేరాలు, మరో ఎస్ఐ అతడిని పట్టుకుని తన్నుకుంటూ, తిట్టుకుంటూ తీసుకెళ్లారు.