హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: మూడేళ్లు కాపురం చేసి చెక్కేసిన ప్రియుడి చెంప చెల్లుమనిపించిన ప్రేయసి...

క్రైమ్09:12 PM IST Apr 24, 2019

ప్రకాశం జిల్లా టంగుటూరులోని బ్రహ్మణ బజార్ ఏరియాకు చెదిన అరవింద్, కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. హైదరాబాద్‌లో ఉన్న సమయంలో అతనికి మణికొండ ఏరియాకు చెందిన సహస్రతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారు. మూడేళ్ల పాటు సహస్రతో కాపురం కూడా చేశాడు అరవింద్. ఈ సమయంలో ప్రియుడి ఖర్చుల కోసం రూ.75 లక్షలు ఖర్చుచేసింది సహస్ర. గత ఏడాది తండ్రి చనిపోయాడంటూ స్వస్థలానికి వచ్చాడు అరవింద్. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌కు వెళ్లలేదు. సహస్ర ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతని నుంచి రెస్పాన్స్ రాలేదు. దాంతో మోసపోయానని గ్రహించిన ఆమె... ప్రకాశం జిల్లా చేరుకుని ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఊరి బయట ఇటుక బట్టీల దగ్గర ఉంటున్నాడని విషయం తెలుసుకున్న సహస్ర అక్కడికి వెళ్లి అరవింద్‌ను ఎడాపెడా వాయించేసింది. అయితే అరవింద్ మాత్రం సహస్రను కేవలం ఓ ఫ్రెండ్‌గానే చూశానని, తన ఆర్థిక పరిస్థితి చూసిన తర్వాత కూడా ఆమె అంత డబ్బు నాకోసం ఖర్చు పెట్టిందంటే ఎలా నమ్ముతారని నిలదీస్తున్నాడు.

Chinthakindhi.Ramu