కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. స్టాఫ్ నర్సుపై ప్రిన్సిపాల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు మద్నూరు మండల కేంద్రంలో ఆందోళనకు దిగారు. నిందితుడు తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన్ను విధుల నుంచి తొలగించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.