హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: కొట్టుకున్న పోలీసులు, లాయర్లు.. రణరంగమైన కోర్టు ప్రాంగణం

క్రైమ్20:15 PM November 02, 2019

ఢిల్లీ టిస్ హజారీ కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయవాదులు, పోలీసు సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది. కోర్టు ఆవరణలో పార్కింగ్ విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ తలెత్తింది. పార్కింగ్ ఏరియాలో ఓ లాయర్ వాహనాన్ని పోలీస్ వాహనం ఢీకొనడంతో వాగ్వాదం జరిగింది. ఆ లాయర్‌ను ఓ రూమ్‌లోకి తీసుకొని పోలీసులు చితకబాదారని తిస్ హజారీ బార్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. ఐదారు మంది పోలీసులు కలిసి చితకబాదారని.. ఇదేంటని అడిగితే తమపై దౌర్జన్యానినికి దిగారని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. పోలీసుల దాడిలో పలువురు లాయర్లు గాయపడ్డారు. వారిని సెయింట్ స్టీఫెన్స్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో తిస్ హజారీ కోర్టు వద్ద భద్రతా దళాలు భారీగా మోహరించాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading