హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : సరదాగా కత్తి చూపించి... దానితోనే ముసలాయనపై దాడి

క్రైమ్14:49 PM June 17, 2019

నిజామాబాద్ జిల్లా... భోదన్‌లో... రాకాసిపేటకు చెందిన పోశెట్టి... షర్బత్ కెనాల్ నుంచీ వెళ్తుండగా... లాలూ సింగ్ అనే వ్యక్తి కత్తితో కనిపించాడు. అతను తెలిసిన వ్యక్తే కావడంతో... అతని దగ్గర కత్తి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు పోశెట్టి. ఐతే... పోశెట్టిని చూడగానే లాలూసింగ్ కత్తిని వెనక్కి దాచడం మొదలుపెట్టాడు. అది చూసిన పోశెట్టి... ఏదీ కత్తి చూపించు, వెనక దాస్తున్నావేంటి... ఎందుకది అంటూ గద్దించాడు. అంతే... తాగిన మత్తులో ఉన్న లాలూసింగ్... అదే కత్తితో పోశెట్టిపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన పోశెట్టిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లాలూసింగ్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Krishna Kumar N