ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామం వద్ద భద్రాచలం డిపో ఆర్టీసి బస్సు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి డ్రైవర్ అతివేగమే కారణమని ప్రయాణికులు మండిపడుతున్నారు.