హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : కర్ణాటకలో దారుణం... గర్ల్‌ఫ్రెండ్‌ని 12 సార్లు పొడిచిన లవర్...

క్రైమ్12:47 PM June 29, 2019

Karnataka : దక్షిణ కర్ణాటక జిల్లాలోని మంగళూరు దగ్గర్లో ఉన్న... దేరాలకట్టె దగ్గర జరిగిందీ దారుణం. 22 ఏళ్ల సుశాంత్, 20 ఏళ్ల దీక్షా... 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుశాంత్ ఓ డాన్సర్. దీక్షా... డిగ్రీ కాలేజీలో స్టూడెంట్. ఇటీవల ఇద్దరికీ చెడింది. కారణాలేమైనా గానీ... అతన్ని దూరం పెడుతూ వచ్చింది దీక్ష. తనను వేధిస్తున్నాడంటూ... స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా పెట్టింది. దీక్షా మరెవర్నో ప్రేమిస్తోందనీ, అందుకే తనను దూరం పెడుతోందని లేనిపోని అనుమానాలు పెంచుకున్నాడు. అందుకే తనపై కేసు పెట్టిందనుకున్నాడు. ప్రేమ స్థానంలో పగను పెంచుకున్నాడు సుశాంత్. శుక్రవారం సాయంత్రం... ఆమె తన ఇంటికి వెళ్తుండగా... బైక్‌పై వచ్చి అడ్డుకున్నాడు సుశాంత్. తనకు అడ్డు రావద్దనీ, వెళ్లనివ్వమని కోరింది దీక్షా. నాకు దక్కని నువ్వు... ఇంకెవరికీ దక్కడానికి వీల్లేదంటూ... కత్తి తీసి... అప్పటికప్పుడే... దాదాపు 12 సార్లు నడిరోడ్డుపై ఆమెను పొడిచాడు సుశాంత్. ఆమె మృత్యువుతో పోరాడుతుంటే... సుశాంత్ తనను తాను మెడ కోసుకున్నాడు. అక్కడే చతికిలపడ్డాడు. వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. తర్వాత సుశాంత్‌ని కూడా తీసుకెళ్లారు. దీక్షా... లంగ్స్, హార్ట్, స్టమక్, లెగ్స్‌లో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. పోలీసులు సుశాంత్‌పై తాజాగా హత్యాయత్నం కేసు నమోదుచేశారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading