దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కల్కి’ ఐటీ దాడుల్లో కీలక పరిణామం ఇది. ఆ ఆశ్రమ వ్యవస్థాపకులైన విజయ్ కుమార్ నాయుడు, పద్మావతి నాయుడు ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. ఐటీ దాడుల నేపథ్యంలో తమిళనాడులోని నేమమ్ ఆశ్రమంలోనే తాము అందుబాటులో ఉన్నామని వెల్లడించారు. ఈ మేరకు మీడియాకు ఓ వీడియోను విడుదల చేశారు. తమ ఆరోగ్యం బాగానే ఉందని, తమ గురించి ఆందోళన చెందవద్దని ఆ వీడియోలో విజయ్‌కుమార్ దంపతులు తెలిపారు.