విధుల్లో ఉండి టిక్ టాక్ చేసి సస్పెండ్ అవుతున్నా... ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం వాటిని కొనసాగిస్తునే ఉన్నారు. కదిరి ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్ టాక్ మానియాలో ఉద్యోగులు మునిగిపోయారు. ల్యాబ్ టెక్నిషియన్స్ సద్గుణ, శైలజ ఇద్దరూ టిక్ టాక్ చేస్తూ బుక్కయ్యారు. వీడియోలు వైరల్ అవ్వడంతో సూపరింటెండెంట్ మధుసూదన్... శైలజను విధుల్లో నుంచి తొలగించారు, మరో ఉద్యోగి సద్గుణకి మెమో జారీచేశారు.