హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఇవాళ ఉదయం రైలు ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్‌లో నిలిపి ఉన్న హంద్రీ ఎక్స్‌ప్రెస్ రైలును లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. రెండు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇంజిన్లు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ లోకో పైలట్ సహా 12 మందికి గాయాలయ్యాయి.