హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : జైశ్రీరాం అనాలంటూ దాడి... ప్రాణాలు కోల్పోయిన ముస్లిం యువకుడు...

క్రైమ్14:19 PM June 24, 2019

జార్ఖండ్‌లోని ఖార్సావన్ జిల్లాలో జూన్ 18న జరిగిందీ దారుణం. దొంగతనం నెపంతో 24 ఏళ్ల ముస్లిం యువకుడు తాబ్రేజ్‌ అన్సారీని చితకబాదారు. ఆ తర్వాత జైశ్రీరామ్ అనాలంటూ చావగొట్టారు. తనను వదిలేయమనీ, తాను వెళ్లిపోతాననీ వేడుకున్నాడు అన్సారీ. వాళ్లు వినలేదు. జై హనుమాన్ అను అంటూ మళ్లీ కొట్టారు. ఇలా గంట కాదు... 18 గంటలు నరకం అనుభవించాడు. అంత సేపు అతన్ని కొట్టిన ఆ మూక... చివరకు పోలీసులకు అప్పగించింది. అప్పటి నుంచీ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అతన్ని జూన్ 22న ఆస్పత్రికి తీసుకెళ్లారు. తీవ్ర గాయాలతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసుకు సంబంధించి... పప్పు మండల్ అనే యువకుణ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణమైన అందర్నీ శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading