HOME » VIDEOS » Crime

Video: ప్రాణం తీసిన బర్త్‌డే బంప్స్... ఐఎమ్ఎమ్ విద్యార్థిని కొట్టి చంపిన స్నేహితులు...

క్రైమ్18:01 PM May 03, 2019

బర్త్ డే బంప్స్ పేరుతో పైశాచికానందం పొందే పద్దతి ఇటీవలి కాలంలో ఎక్కువైంది. పుట్టినరోజు చేసుకునే వ్యక్తిని స్నేహితులంతా కలిసి చితక్కొట్టడం ఇందులో భాగం. ఒక్కోసారి ఇది శృతిమించితే ప్రాణాలు కూడా పోతాయి. ఓ ఐఎంఎం విద్యార్థి కూడా ఇలాగే ప్రాణాలు కోల్పోయాడు. రెండు నెలల క్రితం నాటి ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అతనితో కేక్ కట్ చేయించి పుట్టినరోజు సెలబ్రేట్ చేసిన స్నేహితులు. ఆ తర్వాత విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిలో అంతర్గత అవయవాలు దెబ్బతినడంతో ఉదయాన్నే ఆ విద్యార్థి ఆసుపత్రిపాలయ్యాడు. ఆ తర్వాత విపరీతమైన కడుపు నొప్పితో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాంక్రియాస్ దెబ్బతినడంతోనే అతను చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు.

Chinthakindhi.Ramu

Top Stories