HOME » VIDEOS » Crime

Video: ‘జంట పేలుళ్ల’ కేసు తీర్పు వాయిదా ఎందుకు పడింది?

క్రైమ్16:55 PM August 27, 2018

హైదరాబాద్ జంటపేలుళ్ల కేసులో తీర్పు వాయిదా పడింది. సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం. 2007 ఆగస్ట్ 25న గోకుల్ చాట్, లుంబినీ పార్క్‌లో పేలుళ్లు జరిగాయి. ఈ కేసులో నిందితులను ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి విచారించారు. అనంతరం కేసు తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ జంట పేలుళ్లలో మొత్తం 44 మంది చనిపోగా, 68 మంది గాయపడ్డారు. కేసులో తీర్పు ప్రతి చాలా పెద్దదిగా ఉండడంతో సెప్టెంబర్ 4న జడ్జిమెంట్ ఇవ్వాలని న్యాయమూర్తి నిర్ణయించారు.

webtech_news18

Top Stories