హైదరాబాద్‌లో మరో ఘోరం జరిగింది. బయో డైవర్సిటీ కారు ప్రమాద ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. కూకట్ పల్లి నుంచి సనత్ నగర్ వస్తుండగా కారు అదుపు తప్పి భరత్ నగర్ బ్రిడ్జిపై కింద పడి సొహైల్ అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటనలో మరో ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు స్థానికుల సహాయంతో క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.