దొంగల్లో వీడు మరో రకం. నగలు మాత్రమే దొంగిలిస్తాడు. అవి కూడా బంగారంతో తయారైనవి మాత్రమే. గోల్డ్‌తో పాటూ వజ్రాల నగలు కూడా కొట్టేయడం మొదలుపెట్టాడు. ఇలాంటి కేసులు ఎక్కువవడంతో హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దింపాయి. అలా ఈ కేటుగాడు దొరికాడు. ఇతని నుంచీ 3 కేజీల బంగారం, 20 కేరట్ల వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు వాటి విలువ ఎంతో తెలుసా... కోటి రూపాయలట. సొసైటీలో ఇలాంటి దొంగలు తిరుగుతూ ఉంటే డేంజరే. మనం జాగ్రత్తగా ఉండాల్సిందే.