ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో మూడు టీమ్లతో దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత శివప్రసాదరావు మృతిపై క్లారిటీ వస్తుందని, క్లూస్ టీం, టెక్నీకల్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నాయని స్పష్టం చేశారు.