ఒడిశాకు చెందిన ఓ మహిళ కొరియాలొని ఓ స్కూల్లో క్లీనర్‌గా పనిచేస్తుంది. అక్కడే ఓ గదిలో తన పిల్లలతో కలిసి ఉంటుంది. ఆమెకు మూడునెలల చిన్నారి కూడా ఉంది. ఈ నేపథ్యంలో స్కూల్ సూపరెండెంట్ గదిని ఖాళీ చేయాలని ఆమెపై ఒత్తిడి తెచ్చింది. భర్తను తీసుకొచ్చి... సాటి మహిళ అని చూడకుండా బయటకు ఈడ్చేసింది. చిన్నారిని తీసుకొచ్చి కూడా రోడ్డుపై పడేశారు. ఆమె ఇంట్లో సామన్లు కూడా బయట పడేసి గదికి తాళం వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు సూపరెండెంట్ భర్తపై కేసు నమోదు చేశారు. త్వరలోనే అతడ్ని అరెస్ట్ కూడా చేస్తామని చెబుతున్నారు.