హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : తమిళనాడు, కేరళ సరిహద్దుల్లో హైఅలర్ట్... స్పెషల్ ఎస్సై హత్యతో...

క్రైమ్10:12 AM January 09, 2020

Tamilnadu : బుధవారం రాత్రి తమిళనాడుకు చెందిన స్పెషల్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ విల్సన్‌(58)ను ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. తమిళనాడులోని పదంతలుమూడు చెక్‌పోస్ట్‌ దగ్గర ఈ దారుణం జరిగింది. ఇది పక్క రాష్ట్రం కేరళ సరిహద్దుకు 50 మీటర్ల దూరంలోనే ఉంది. ఐతే... ఈ దారుణానికి సంబంధించి తమిళనాడు పోలీసులు ఇద్దరు వ్యక్తుల్ని నిందితులుగా గుర్తించారు. వారిద్దరికీ క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందని తెలిసింది. ఐతే... ఈ హత్య ఎందుకు చేశారన్నది మాత్రం పోలీసులు ఇంకా తెలుసుకోలేదని తెలిసింది. చనిపోయిన ఎస్సై... ఇదివరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్‌లో పనిచేశారు. నిందితులకూ, ఎస్సైకీ మధ్య ఏమైనా సంబంధాలున్నాయా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. 58 ఏళ్ల విల్సన్... కలియిక్కవిలాయ్ జిల్లా స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ... అక్కడి చెక్ పోస్ట్ దగ్గర వెహికిల్స్‌ని చెక్ చేస్తున్నారు. కలియిక్కవిలాయ్ జిల్లాలోకి దుండగులు ఓ SUV కారులో వచ్చినట్లు తెలిసింది. ఎస్సై దగ్గరకు వచ్చిన వాళ్లు... సడెన్‌గా కారు దిగి... నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ఎస్సై తల, పొట్టలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. చెక్ పోస్ట్ దగ్గరున్న మిగతా పోలీసులు రియాక్ట్ అయ్యేలోపే... దుండగులు కారులో పారిపోయారు. ఎస్సైని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించేలోపే ఆయన చనిపోయారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుల్ని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సెర్చ్ టీమ్ ఏర్పాటైంది.

webtech_news18