హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : హాజీపూర్‌లో ఉద్రిక్తత... సైకో కిల్లర్ శ్రీనివాస్ ఇంటిని తగలబెట్టిన స్థానికులు

క్రైమ్13:25 PM April 30, 2019

Hazipur Serial Murders : యాదాద్రి భువనగిరి జిల్లా... బొమ్మలరామారం మండలం... హాజీపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ముగ్గురు బాలికల హత్య కేసులో నిందితుడైన శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై గ్రామస్థులు ఆగ్రహాంతో దాడి చేశారు. ఇంటిని తగలబెట్టారు. ఇల్లు మొత్తం కాలి బూడిదైంది. హాజీపూర్-మైసిరెడ్డి పల్లి దారిలో ఉన్న ఆ బావిలో చాలా మంది యువతుల మృతదేహాలు ఉండి ఉండొచ్చని తెలుస్తోంది. చుట్టుపక్కల గ్రామాల్లో కొన్నేళ్లుగా చాలామంది యువతులు కనిపించకుండా పోతున్నారు. వాళ్లందర్నీ శ్రీనివాస రెడ్డే చంపేసి... ఆ బావిలో పడేసి ఉంటాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే మనీషా మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు... శ్రావణి డెడ్ బాడీని కూడా ఆ బావి నుంచీ బయటకు తీస్తున్నారు. అలాగే... కల్పన అనే మరో మిస్సింగ్ అయిన బాలికను కూడా శ్రీనివాస్ చంపేసి ఉంటాడనే అనుమానాలున్నాయి. అతని కుటుంబం హాజీపూర్ నుంచీ పారిపోయింది.

Krishna Kumar N