HOME » VIDEOS » Crime » GIRL PROTEST IN FRONT OF LOVERS HOUSE IN NIRMAL DISTRICT BA

Video: ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా

క్రైమ్19:49 PM March 04, 2020

తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పిన యువకుడు మరో మహిళతో వివాహానికి సిద్ధం కావడంతో అతడి ఇంటి ఎదుట ప్రియురాలు ఆందోళనకు దిగింది. నిర్మల్ జిల్లా మామడ మండలం దిమ్మదుర్తి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దిమ్మదుర్తి గ్రామానికి చెందిన శివరాత్రి శిరీష, నరేష్ గౌడ్ లు గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల నరేష్ గౌడ్ కు వివాహం నిశ్చయం కావడంతో తనను కాకుండా వేరే అమ్మాయితో పెళ్లి ఎలా చేసుకుంటావని శిరీష నిలదీసింది. దీంతో నరేష్ గౌడ్ ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పడంతో బాధితురాలు నరేష్ గౌడ్ ఇంటి ముందు తన కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించింది. 

webtech_news18

Top Stories