హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : గుడ్లగూబల అక్రమ రవాణా.. పట్టుకున్న పోలీసులు..

క్రైమ్13:48 PM October 23, 2019

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో అక్రమంగా గుడ్లగూబలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరుదైన జాతికి చెందిన ఈ గుడ్లగూబలకు బ్లాక్ మార్కెట్‌లో లక్షల రూపాయలకు విక్రయిస్తారని పోలీసులు తెలిపారు. దీపావళి సందర్భంగా గుడ్లగూబలకు డిమాండ్ పెరిగిందన్నారు. దీపావళి రోజు లక్ష్మి పూజ సందర్భంగా గుడ్లగూబను బలిస్తే.. ఆ ఇంట్లో లక్ష్మి దేవి కొలువుదీరుతుందని చాలామంది విశ్వసిస్తారని తెలిపారు. అలాగే గుడ్లగూబ ఎముకలు కూడా మార్కెట్లో అధిక ధర పలుకుతాయని.. అందుకే వాటిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు. సుమిత్ కుమార్,ప్రదీప్ కుమార్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఒక బకెట్‌లో వాటిని దాచిపెట్టి తరలిస్తుండగా వైశాలి సెక్టార్ 5లో పట్టుకున్నట్టు తెలిపారు. ఒక అంచనా ప్రకారం దేశంలో గుడ్లగూబల ట్రేడింగ్‌కి ఆగ్రా మేజర్ హబ్‌గా మారిందని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే,దీపావళి రోజు గుడ్లగూబను బలిచ్చే ఆచారం కొనసాగుతోందని పోలీసులు తెలపడం చర్చనీయాంశంగా మారింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading