HOME » VIDEOS » Crime

Video: హైదరాబాద్‌లో సిలిండర్ పేలుడు... ఫ్రిజ్ వల్లే ఈ పరిస్థితి...

హైదరాబాద్... మలక్‌పేటలోని వెంకటాద్రి నగర్‌లో చాలా ఇళ్లలో అదొకటి. ఆ ఇంట్లో అర్థరాత్రి ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. కారణం ఇంట్లోని సిలిండర్ ఒక్కసారిగా పేలింది. దాంతో... ఇద్దరు ముసలివాళ్లు... ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. ఇల్లంతా చిందరవందర అయ్యింది. మంటలు వ్యాపించాయి. ఇంటి గేటు నాశనమైంది. ఇంటి కిటికీలతోపాటూ... పక్క ఇళ్ల అద్దాలు కూడా పగిలిపోయాయి. ఇంటి పైకప్పు ముక్కలైంది. బయటి మొక్కలు, కుండీలు, కార్లు కూడా ధ్వంసమయ్యాయి. ఇలా ఒక్క సిలిండర్ పేలుడు వల్ల ఇంత తీవ్ర ప్రమాదం జరిగింది. విషయం తెలిసి చుట్టుపక్కల ప్రజలు పరుగులు తీశారు. అమ్మో అమ్మో అంటూ అరుపులు అరిచారు. ఏదో జరిగిపోతోందన్న టెన్షన్ అందరిలోనూ కనిపించింది. ప్రమాదం జరగడానికి ఫ్రిజ్ కారణం : మీరు కూడా ఇలా సిలిండర్ పక్కనే ఫ్రిజ్ పెట్టుకుంటున్నట్లైతే... వెంటనే జాగ్రత్త పడండి. ఎందుకంటే... ఈ ప్రమాదం జరగడానికి ఇంట్లోని ఫ్రిజ్ ప్రధాన కారణం అయ్యింది. మీకు తెలుసుగా... ఫ్రిజ్ దానంతట అదే ఆన్, ఆఫ్ అవుతుంది. అలా అయ్యేలా అందులో థెర్మోస్టాట్ ఉంటుంది. ఈ ప్రమాదంలో... సిలిండర్ నుంచీ గ్యాస్ లీకైన తర్వాత... అప్పటివరకూ ఆఫ్‌లో ఉన్న ఫ్రిజ్... ఆన్ అయ్యింది. వెంటనే ఆక్సిజన్ రిలీజై... గ్యాస్, ఆక్సిజన్ కలవడంతో... ఒక్కసారిగా సిలిండర్ పేలింది.

webtech_news18

Top Stories