ఇత్తడి విగ్రహాన్ని పంచలోహ విగ్రహంగా పరిచయం చేస్తారు. సాధారణ రాయిని నాగమణిగా ప్రచారం చేస్తారు. ఆ రెండింటిని కలిపి పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని కలరింగ్ ఇస్తారు. ఇలా నకిలీ వస్తువులను కోటి రూపాయలకు అమ్మేందుకు ప్రయత్నించిన ముఠాను హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు.