సిద్ధిపేట జిల్లా పందిల్ల గ్రామానికి చెందిన వెల్దండి రాములు శనివారం అర్ధరాత్రి మరణించాడు. పేదరికం కారణంగా పొట్టికూటి కోసం గుజరాత్‌కు వెళ్లిన కొడుకు కనకయ్య లాక్డౌన్ పరిస్థితుల వల్ల అక్కడే చిక్కుకుపోయాడు. ఏం చేయలేని పరిస్థితుల్లో కట్టుకున్న భార్యే తన భర్త రాములుకు తలకొరివి పెట్టింది. తండ్రి అంత్యక్రియలను లైవ్‌లో చూసిన కనకయ్య.. కన్నతండ్రి చివరి చూపునకు నోచుకోలేకపోయానని కన్నీరుమున్నీరయ్యాడు.