మలేసియాలో ఉద్యోగాల కోసం ఓ ఏజెంట్ మాటలు నమ్మి వెళ్లి మోసపోయిన ఐదుగురు యువకులను తెలంగాణ జాగృతి సంస్థ క్షేమంగా ఇంటికి చేర్చింది. ఐదుగురు యువకులు తాము ఎదుర్కొన్న ఘటనల గురించి చెబుతుంటే వినేవారి కళ్లు చెమర్చాయి.