హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: నడి రోడ్డుపైనే వైసీపీ ఎమ్మెల్యే కుమారుడి పుట్టిన రోజు వేడుకలు

ఆంధ్రప్రదేశ్15:36 PM September 20, 2019

తూర్పు గోదావరి జిల్లా సీ.గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కుమారుడు వికాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం నాడు వికాస్ పుట్టిన రోజు వేడుకలను అంబాజీపేట జంక్షన్‌లో నడిరోడ్డుపై నిర్వహించారు. దీని వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నానా హంగామా చేయడంతో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు, ట్రాఫిక్ ఆంక్షలకు విరుద్ధంగా రోడ్డుపై పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారని వికాస్, అతని అనుచరులపై అంబాజిపేట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188, 290, సెక్షన్ 32 కింద వారిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

Shravan Kumar Bommakanti