పెళ్లి వేడుకలో డీజే చిచ్చుపెట్టింది. డీజే వద్దన్నందుకు పెళ్లి మండపంలోనే ఎవరూ ఊహించని విధంగా గొడవ జరిగింది. ఇరు పక్షాల బంధువుల మధ్య మాట మాట పెరగడంతో గొడవ జరిగింది. అమ్మాయి, అబ్బాయి తరపు బంధువులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కుర్చీలు విరిగేలా కొట్టుకున్నారు. సూర్యాపేట జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.