HOME » VIDEOS » Crime

Video : కామారెడ్డిలో దారుణం.. ముగ్గురు కూతుళ్లను చెరువులో ముంచి చంపిన తండ్రి

క్రైమ్17:53 PM March 06, 2020

కూతురికి చిన్న గాయం తగిలితేనే తండ్రి గుండె తల్లడిల్లుతుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తెకు ఏ కష్టమొచ్చినా.. తండ్రి ప్రాణం కొట్టుకుంటుంది. కానీ ఈ తండ్రి మాత్రం కన్న కూతుళ్లను కర్కశంగా చంపేశాడు. ముగ్గురు బిడ్డలను చెరువులో ముంచి దారుణంగా హత్యచేశాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఈ ఘోరం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్కోల్‌ గ్రామానికి చెందిన ఫయాజ్‌కు ముగ్గురు కూతుళ్లు అఫియా (10), మహీన్ (9), జియా( 7) ఉన్నారు. కొంతకాలం వీళ్లింట్లో గొడవలు జరుగుతున్నాయి. గురువారం కూడా జూదం ఆడేందుకు డబ్బులు ఇవ్వాలంటూ.. భార్యతో ఘర్షణకు దిగాడు.  ఆ తర్వాత కాసేపటికే  తమ ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. బాలికల కోసంవెతుకుతున్న సమయంలోనే శుక్రవారం ఉదయం రాజారం దుబ్బ చెరువులో ముగ్గురి శవాలు కనిపించాయి. అక్కాచెల్లెళ్లు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఐతే ఆ ముగ్గురు చిన్నారులను తండ్రే చంపాడని గ్రామస్తులు పోలీసులకు చెప్పారు. వారు అభంశుభం తెలియని పసిపిల్లలని..భార్యపై కోపంతో తండ్రే చెరువులో ముంచి హత్యచేశాడని తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ఫయాజ్‌ కోసం గాలిస్తున్నారు.

webtech_news18

Top Stories