నిజామాబాద్ జిల్లాలో విషాదం జరిగింది. బోధన్ మండలం మినార్ పల్లి గ్రామములో చేపల వేటకు వెళ్లి తండ్రికొడుకుల మృతి .. గ్రామానికి చెందిన దీప్ల,తన కొడుకు శ్రీనివాస్ తో కలిసి స్థానిక మద్దికుంట చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. చెరువు లోతు ఎక్కువగా ఉండటంతో చేపలు పట్టే క్రమంలో నీట మునిగారు. ఊపిరి ఆడక ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.