సంగారెడ్డి తహసీల్దార్ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడో రైతు. భూమి సర్వే కోసం పలుసార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని మనస్తాపం చెందిన గడ్డం యాదయ్య అనే రైతు పెట్రోల్ ఒంటిపై పోసుకునేందుకు ప్రయత్నించాడు. స్థానికులు అతడ్ని వారించి, పెట్రోల్ డబ్బాను పడేశారు. అంతేకాదు.. ఎమ్మార్వో రావడంతో ఆయన కాళ్లు పట్టుకుని న్యాయం చేయాలని వేడుకున్నాడు.