హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : పొలంలోనే రైతు మృతి... ఆ ఇంట విషాదం...

క్రైమ్13:24 PM October 29, 2019

అన్నం పెట్టే రైతన్నలు సంతోషంగా ఉండటం ఎప్పుడైనా చూశారా... ఎప్పుడూ కష్టాలే. పంట బాగా పండించాలనీ, మనందరికీ కడుపు నింపాలని ప్రతీక్షణం ప్రయత్నించే రైతులకు ప్రకృతి చాలాసార్లు అన్యాయం చేస్తోంది. గుంటూరు జిల్లా... ప్రత్తిపాడు నియోజకవర్గం... కాకుమానులో పోలంలో కలుపుతీస్తున్న రైతు కొంగర సాంబయ్య (55) చనిపోయాడు. అందుకు కారణం ఏంటన్నది మాత్రం తెలియట్లేదు. ఆ చుట్టుపక్కల పాములు ఎక్కువే. ఆయన పాము కాటుతో చనిపోయాడా లేక... గుండెపోటుతో చనిపోయాడా అన్నది తేలాల్సి ఉంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు రాసి... మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఇలా సాంబయ్య చనిపోవడంతో... ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading