హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: తప్పు చేయను అన్నందుకు తహసీల్దార్ మీద రైతు దాడి...

క్రైమ్21:03 PM February 01, 2020

నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అసైన్మెంట్ భూమిని పట్టా భూమిగా మార్చాలని ఓ రైతు అధికారులపై దాడికి దిగాడు. కుర్నపల్లి గ్రామానికి చెందిన భవ్య పేరుమీద 3 ఎకరాల 20 గుంటల భూమి ఉంది. శ్రీనివాస్ పేరు మీద 2.14 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని వర్ని మండలం నెహ్రూ నగర్ గ్రామానికి చెందిన శ్రీనివాస రావు అలియాస్ లడ్డు శ్రీనివాస్ అనే రైతు అసైన్మెంట్ భూమిని కొనుగోలు చేశాడు. ఈ భూమిని పట్టా భూమి గా మార్చాలని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ని కలిసి తన భూమిని పట్టా భూమి గా మార్చాలని ఒత్తిడి తీసుకు వచ్చాడు. పట్టా భూమి గా మార్చడం కుదరదని తహసీల్దార్ చెప్పడంతో రైతు శ్రీనివాస్ తహసీల్దార్ పై దాడికి యత్నించాడు. దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన వీఆర్వో ఫుల్ సింగ్ పై దాడికి ప్రయత్నించాడు. కార్యాలయంలో విధులకు ఆటంకం పరచడంతో పాటు దాడికి యత్నించిన రైతుపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading