హర్యానాలోని ఫరీదాబాద్‌లో దారుణం జరిగింది. పట్టపగలు ఓ వ్యక్తి వేటకొడవలితో మరో వ్యక్తిపై దాడి చేశారు. నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే, దాడికి కారణాలు తెలియరాలేదు.