జలుమూరు మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కళావతి, శంకర్రావు భార్యభర్తలు. వీరికి కుమార్తె గీతాంజలి ఉంది. అయితే శంకర్రావు పలు కారణాల రీత్యా ఓ వ్యక్తి వద్ద కొంత నగదు అప్పుగా తీసుకున్నాడు. వివిధ కారణాల వల్ల సకాలంలో అప్పును చెల్లించకపోయాడు. దీంతో అప్పు తీర్చలేదని శంకర్రావు ద్విచక్రవాహనాన్ని అప్పు ఇచ్చిన వారు తీసుకెళ్లారు. దీన్ని జీర్ణించుకోలేక కుటుంబం మొత్తం పురుగుల మందు తాగారు. గమనించిన స్థానికులు ముగ్గురిని నరసన్నపేట గ్రామంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ భార్యభర్తలు, కుమార్తె సహా ముగ్గురు చనిపోయారు. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.