హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: యువతిని వేధించారని యువకులపై దాడి..!

ఆంధ్రప్రదేశ్17:51 PM August 02, 2019

ప్రకాశం జిల్లా సింగరాయకొండ లో ముగ్గురు యువకులు ను ఓ ఆరుగురు యువకులు జామాయిల్ తోటలోకి తీసుకెళ్ళి తీవ్రంగా కొట్టి హింసించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్తానిక RTC బస్ స్టాండ్ వద్ద ఓ యువతి ని వేధించినారని అని యువతి కుటుంబ సభ్యులకు చెప్పగా.... విషయం తెలుసుకొని మెత్తం ఆరుగురు యువకులు కలసి ఈ ముగ్గురు యువకులను జామాయిల్ తోటలోనికి తీసుకెళ్ళి విచక్షణా రహితంగా హింసించిన వీడియో బయటకు రావడంతో స్థానికంగా కలకలం రేగింది.మేము ఏతప్పు చేయలేదని ప్రాధేయపడుతున్నా ఏమాత్రం కనికరం చూపకుండా విచక్షణారహితంగా చావబాదారని బాధితులు వాపోయారు.ఈవిషయమై పోలీసులు స్పందిస్తూ చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం నేరమని, ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. దాడికి పాల్పడినవారు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

webtech_news18