టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై మరో కేసు నమోదైంది. ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఫేక్ ఐడి కార్డు క్రియేట్ చేసినట్టు రవిప్రకాశ్‌పై అభియోగాలు నమోదయ్యాయి. 406/66 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఐటీ యాక్ట్ కింద కేసు సీసీఎస్ పోలీసులు ఈ కేసు పెట్టినట్టు సమాచారం. మరోవైపు చంచల్ గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న రవి ప్రకాశ్‌ను పిటీ వారెంట్‌పై మియాపూర్ కోర్టుకు తీసుకువచ్చారు పోలీసులు. ఆయన్ను తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరగా.. 14 రోజులు రిమాండ్ విధించింది.