హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : సూర్యాపేటలో పేలుడు.. ఒకరు మృతి

క్రైమ్18:57 PM September 13, 2019

సూర్యాపేటలో తీవ్ర కలకలం రేగింది. ఓ పాత సామాన్ల దుకాణంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అయ్యప్ప దేవాలయం సమీపంలో ఈ పేలుడు సంభవించింది. మృతుడిని మధ్యప్రదేశ్‌కు చెందిన రామచంద్ర సాహు గా గుర్తించారు. రామ్‌కోటి తండాకు చెందిన బుజ్జమ్మ, చిలకమ్మతో పాటు యూపీకి చెందిన సల్మాన్‌కు గాయాలు కావడంతో.. వారిని సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading