హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు... తల్లిదండ్రులు హ్యాపీ

క్రైమ్11:14 AM January 09, 2020

దర్పణ్... ఇది తెలంగాణ పోలీసులు తెచ్చిన ప్రత్యేక ఆపరేషన్. దీని ద్వారా... మిస్సింగ్ కంప్లైంట్లలో తప్పిపోయిన పిల్లల్ని వెతికి కనిపెట్టి... తిరిగి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు. ఇలా ఇప్పటికే వేల మందిని అప్పగించారు. తాజాగా తమ కొడుకు మిస్సింగ్ అయ్యాడని తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వగానే... తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. పిల్లవాడి వివరాలన్నీ తెలుసుకొని... ఆచూకీ కోసం గాలించారు. ఆ క్రమంలో... కుషాయిగూడ పోలీసులు ఓ పిల్లాణ్ని చూశారు. తాము వెతుకుతున్నది ఆ పిల్లాడినేనా అన్న డౌట్ వచ్చింది. ఫేషియల్ రికగ్నిషన్ టూల్ ఉపయోగించి... పిల్లాణ్ని గుర్తించారు. పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి... తల్లిదండ్రులకు కాల్ చేశారు. ఎంతో ఆతృతగా వచ్చిన ఆ తల్లిదండ్రులు... పిల్లాణ్ని చూసి... పట్టరాని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇక ఆ తల్లైతే... కన్నకొడుకును ఆప్యాయంగా ముద్దులు పెట్టుకొని... హత్తుకొని కన్నీరు పెట్టింది. పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది. IPS అధికారిణి స్వాతి లక్రా... ఆ వీడియోని ట్విట్టర్‍‌లో పోస్ట్ చేశారు. మంత్రి కేటీఆర్ ఆ ట్వీట్‌ని లైక్ చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading