రిటైర్డ్ జస్టిస్ నూతి రామ్మోహన్ రావు, ఆయన భార్య, కుమారుడు వశిష్టపై వరకట్నం వేధింపుల కేసు నమోదైంది. జస్టిస్ నూతి రామ్మోహన్ రావు కోడలు సింధు శర్మ వారిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను దారుణంగా హింసించారని, తనను కొట్టడంతో గాయాలపాలై ఆస్పత్రిలో చేరినట్టు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.