ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టు ఎటాక్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, దూరదర్శన్ కెమెరామన్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాకు చెందిన అచ్యుతానంద సాహు అనే కెమెరామన్ చనిపోయినట్టు ధ్రువీకరించారు. మరో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. దంతెవాడ జిల్లాలోని అరన్‌పూర్‌లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించేందుకు వెళ్లారు. వారితో పాటు దూరదర్శన్ బృందం కూడా వెళ్లింది.