దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎల్పీజీ సిలిండర్ పేలిన ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పశ్చిమ ఢిల్లీలోని మోతినగర్ ప్రాంతంలో గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది